సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

ABN, First Publish Date - 2023-11-05T13:23:45+05:30

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని పెద్దోడు విక్టరీ వెంకటేష్, చిన్నోడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పక్కపక్కన కూర్చుని ఎంజాయ్ చేస్తోన్న పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అకేషన్ ఏమిటనేది తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ మాత్రం సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.

Venkatesh and Mahesh Babu at Private Party
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC) సినిమాలోని పెద్దోడు విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), చిన్నోడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మరోసారి పక్కపక్కన కూర్చుని ఎంజాయ్ చేస్తోన్న పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఆ సినిమాలో వారిద్దరి నటన ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో తెలియంది కాదు. రియల్ లైఫ్‌లో అన్నదమ్ములు ఎలా అయితే ఉంటారో.. అలానే వెంకీ, మహేష్ నటించారు. ప్రతి ఒక్కరూ ఇది మనమే అనుకునేలా వారి నటన, పాత్రలు ఉండటంతో.. ఆ సినిమా పేరు ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడ కనిపించినా.. జనాలు కూడా పెద్దోడు, చిన్నోడు అనడమే స్టార్ట్ చేశారు.

Venki.jpg

వీరిద్దరూ తాజాగా ఓ ప్రైవేట్ పార్టీకి (Private Party) హాజరయ్యారు. సోషల్ మీడియాలో మేఘ కృష్ణారెడ్డి క్లబ్ హౌస్ ఓపెనింగ్‌‌లో ఇలా వెంకీ, మహేష్ సరదాగా.. అని టాక్ నడుస్తున్నప్పటికీ.. ఎక్కడ వీరిద్దరు ఇలా కలిశారనేది మాత్రం అధికారికంగా బయటికి రాలేదు. ఈ పిక్‌లో పొలిటికల్ లీడర్ దానం నాగేందర్‌తో పాటు మరికొంత మంది కనిపిస్తున్నారు. మహేష్ వెనుక నిలబడి ఉన్నవారిలో నమ్రతా శిరోద్కర్ కూడా కనిపిస్తున్నారు. అకేషన్ ఏమిటనేది క్లారిటీ లేకపోయినా.. సోషల్ మీడియాలో ఈ పిక్ సెన్సేషన్‌ని మాత్రం క్రియేట్ చేస్తోంది. (Venkatesh and Mahesh Babu Pic)


Mahesh.jpg

ఇక మహేష్ బాబుకి సంబంధించి ఈ పిక్‌తో పాటు.. ఆయన ప్రస్తుతం చేస్తోన్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా నుండి ధమ్ మసాలా సాంగ్ ప్రోమోని వదలడంతో మహేష్ బాబు పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పెద్దోడు.. అదే విక్టరీ వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ (Saindhav) సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని.. చిన్నోడికి పోటీగా సంక్రాంతికే వచ్చేందుకు సిద్ధమవుతోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

************************************

*Actress: విద్యార్థులపై చేయి చేసుకున్న సినీ నటి అరెస్ట్.. విషయం ఏమిటంటే?

************************************

*Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

**********************************

*Hi Nanna: ‘అమ్మాడి’ పాటతో కట్టిపడేస్తోన్న అమ్మాడి..

**********************************

Updated Date - 2023-11-05T13:23:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!