సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

VarunLav: కొత్త దంపతులతో సహా హైదరాబాదు చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు

ABN, First Publish Date - 2023-11-04T15:23:00+05:30

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ఇటలీ వివాహం చేసుకున్నాక ఈరోజు హైద్రాబాదు వచ్చారు. ఎయిర్ పోర్టులో వాళ్ళకి పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు అభిమానులు.

Newly married couple Varun Tej and Lavanya Tripathi reached Hyderabad after their wedding in Italy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వరుణ్ తేజ్ (VarunTej), లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) లు ఇటలీలో వివాహం చేసుకున్నాక, ఈరోజు హైదరాబాదు చేరుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లకి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ ఇద్దరితో పాటు మొత్తం మెగా కుటుంబ సభ్యులు #MegaFamily అందరూ హైదరాబాదు చేరుకున్నారు. వీళ్లందరికన్నా ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్ (PawanKalyan) హైదరాబాదు చేరుకున్నారు. అలాగే అల్లు అర్జున్ (AlluArjun) దంపతులు కూడా ముందుగానే వచ్చేసారు.

newlymarriedcouple3.jpg

ఈరోజు మిగతా మెగా కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాదు చేరుకున్నారు. నటుడు నితిన్ (Nithiin), అతని భార్య కూడా వరుణ్ తేజ్, లావణ్య ల వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. వాళ్ళు కూడా హైదరాబాదు చేరుకున్నారు. అలాగే చిరంజీవి (Chiranjeevi), నాగబాబు (Nagababu), చిరంజీవి కుమార్తెలు, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (NiharikaKonidela), అందరూ హైదరాబాదు చేరుకున్నారు.

newlymarriedcouple1.jpg

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు మణికొండ లోని వారి స్వగృహానికి చేరుకున్నారు. నవంబర్ 5వ తేదీన హైదరాబాదులో పరిశ్రమలోని అతిథిల కోసం రెసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ (RamCharan), ఉపాసన (Upasana) తమ పాపతో హైదరాబాదు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మెగా కుటుంబ సభ్యులు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సాంఘీక మాదేమాల్లో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-11-04T15:23:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!