సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-07T15:46:46+05:30

మంచి విషయాల కోసం అరెస్టు కావడంలో తప్పు లేదని బీజేపీ తమిళనాడు ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి, నటి రంజనా నాచ్చియార్‌ అన్నారు. అడయార్, గెరుగంబాక్కంలో ఎంటీసీ బస్సులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులపై చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ వచ్చిన అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ranjana Nachiyar Arrest
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచి విషయాల కోసం అరెస్టు కావడంలో తప్పు లేదని బీజేపీ తమిళనాడు ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి, నటి రంజనా నాచ్చియార్‌ (Ranjana Nachiyar) అన్నారు. అడయార్, గెరుగంబాక్కంలో ఎంటీసీ బస్సు (MTC Bus)లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులపై చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు శ్రీపెరంబుదూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత రంజనా నాచ్చియార్‌ (Ranjana Nachiyar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాట్లాడుతూ.. ‘‘ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులను చూడగానే నాకు కోపం కట్టలు తెంచుకుంది. ఇలాంటి కోపం నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, మనకెందుకులే అనుకుంటూ వెళ్ళిపోతారు. చివరకు బస్సు డ్రైవర్‌, కండక్టరుకు కూడా కోపం ఉంటుంది. కానీ, వారు కూడా ఏం పట్టించుకోకుండా తమ విధులు నిర్వర్తిస్తుంటారు. నా వరకు నేను అలా ఉండలేను. అందుకే ఆ రోజున అలా ప్రవర్తించాను. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ సంఘటన తర్వాత పోలీసులు నన్ను అరెస్టు చేశారు. అయినా భయపడలేదు. (Ranjana Nachiyar Reaction after Release)


Ranja.jpg

గాంధీజీ, నేతాజీ అడుగుజాడల్లో నడుచుకునే కుటుంబం మాది. కేవలం విద్యార్థులను కొట్టడం.. కండక్టర్‌, డ్రైవర్‌ను దూషించిన విషయాన్నే పెద్దది చేసి మాట్లాడుతున్నారు. విద్యార్థుల ప్రవర్తనను ఎవరూ ఖండించడం లేదు. కన్నబిడ్డలపై తల్లిదండ్రులు చేయి చేసుకోరాదని ఎపుడైతే అన్నారో, టీచర్స్‌ని కూడా బెదిరిస్తున్నారో.. ఆ రోజే పిల్లలకు భయం లేకుండా పోయింది. ఈ ధోరణి ఇలానే కంటిన్యూ అయితే మాత్రం తర్వాత జనరేషన్ చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. విద్యార్థులకు ఏం కాకూడదనే ఆ నిమిషం నేనలా రియాక్ట్ అయ్యాను’’ అని రంజనా నాచ్చియార్‌ (Ranjana Nachiyar Actress) తెలిపారు.


ఇవి కూడా చదవండి:

========================

*Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

*************************************

*Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

************************************

*Actress: విద్యార్థులపై చేయి చేసుకున్న సినీ నటి అరెస్ట్.. విషయం ఏమిటంటే?

************************************

*Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

**********************************

Updated Date - 2023-11-07T15:46:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!