సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Mani Ratnam: ఇతను కూడా కాపీక్యాట్, కమల్ 'తగ్ లైఫ్' ఆ సినిమాకి కాపీ?

ABN, First Publish Date - 2023-11-07T17:27:02+05:30

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న 'తగ్ లైఫ్' టీజర్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఒక హాలీవుడ్ సినిమాకి కాపీ గా ఉన్నాయని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Kamal Haasan in Thug Life
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అగ్ర దర్శకుడు మణిరత్నం (Mani Ratnam), కమల్ హాసన్ (Kamal Haasan) మరొకసారి చేతులు కలిపి 'తగ్ లైఫ్' #ThufLife అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. కమల్ హాసన్ 234వ సినిమాగా వస్తున్న #KH234 ఇది ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమా టీజర్ కమల్ హాసన్ పుట్టినరోజు (Happy Birthday Kamal Haasan) సందర్భంగా విడుదలైంది. ఇది ఇప్పుడు ట్రేండింగ్ కూడా అవుతోంది. ఇందులో కమల్ హాసన్ ఒక దొంగ, క్రిమినల్ గా కనపడనున్నారు అని తెలుస్తోంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన 'నాయకుడు' సినిమాకి ఇది సీక్వెల్ గా కనపడుతోంది అని నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే ఈ టీజర్ లో కమల్ హాసన్ పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ (Rangaraya Sakthivel Nayakar) గా చెప్పుకుంటాడు, 'నాయకుడు' సినిమాలో కమల్ హాసన్ పేరు కూడా శక్తివేల్ నాయకర్ (Sakthivel Naicker) అందుకని ఆ సినిమాకి సీక్వెల్ గా ఉండొచ్చు అని అంటున్నారు.

kamalhaasanthuglifecopy.jpg

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ చూసాక నెటిజన్స్ అందరూ ఈ సినిమా హాలీవుడ్ సినిమాకి కాపీ అని అంటున్నారు. కమల్ హాసన్, మని రత్నం సినిమాలు కూడా వేరే సినిమా నుండి కాపీ చేసేస్తున్నారు అని నెటిజన్స్ సాంఘీక మాధ్యమంలో ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లో విజువల్స్ 'రైజ్ అఫ్ స్కై వాకర్' (Rise of Skywalker) అనే హాలీవుడ్ సినిమాకి కాపీ కొట్టారని నెటిజన్స్ ఆ సినిమా స్టిల్స్, ఈ 'తగ్ లైఫ్' #ThufLife స్టిల్స్ పక్క పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు.

కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది, ఇందులో కమల్ హాసన్ యాక్షన్ సన్నివేశం అదిరిపోయేట్టు వుంది. మణి రత్నం మార్క్ కనపడుతోంది. రవి కె చంద్రన్ (Ravi K Chandran) ఛాయాగ్రహణం ఈ టీజర్ లో అద్భుతంగా వుంది. ఈ సినిమాలో ఇంకా మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (DulquerSalman), జయం రవి (JayamRavi), త్రిష (Trisha) నటిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ (ARRahman) దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.

Updated Date - 2023-11-07T17:27:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!