సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

ABN, First Publish Date - 2023-11-03T07:41:57+05:30

తన విలక్షణ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు హీరో జేడీ చక్రవర్తి. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బిజీ నటుడిగా మారిన ఆయన సిల్వర్ స్క్రీన్, ఓటీటీ ఇలా అన్ని రకాల మాధ్యమాల్లో కొత్త కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. అలా జేడీ చక్రవర్తి ఈ మధ్య ‘దయా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. అందులో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అందులోని నటనకు గానూ తాజాగా ఆయన ఉత్తమ నటుడి అవార్డ్‌ను అందుకున్నారు.

JD Chakravarthy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తన విలక్షణ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు జేడీ చక్రవర్తి (JD Chakravarthy). కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ నటుడిగా ఫుల్ బిజీగా మారుతున్నారు. సిల్వర్ స్క్రీన్, ఓటీటీ ఇలా అన్ని రకాల మాధ్యమాల్లో కొత్త కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. కొత్త కథలు, భిన్న పాత్రలు ఆయన వద్దకే వస్తున్నాయి. అలా జేడీ చక్రవర్తి ఈ మధ్య ‘దయా’ (Dayaa) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. అందులో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అందులోని నటనకు గానూ తాజాగా ఆయన ఉత్తమ నటుడి అవార్డ్‌ను అందుకున్నారు.

ఓటీటీ ప్లే (OTT Play) అనే సంస్థ దేశ వ్యాప్తంగా వచ్చిన ఓటీటీ కంటెంట్‌లో ది బెస్ట్ ఎంచుకుని.. అవార్డులతో సత్కరించింది. ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌లకు కూడా ఈ అవార్డలలో స్థానం దక్కింది. ఈ అవార్డుల్లో భాగంగా ‘దయా’ వెబ్ సిరీస్‌కు రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్ (Best Director), బెస్ట్ యాక్టర్ (Best Actor) కేటగిరీలో ‘దయా’కు అవార్డులు వచ్చాయి. దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadhineni), హీరో జేడీ చక్రవర్తి (Best Actor JD Chakravarthy)లకు ఈ అవార్డులు వచ్చాయి.


Dayaa.jpg

జేడీ చక్రవర్తికి ఇలా అవార్డులు రావడం అనేది కొత్త కాదు. ‘దహిణి ది విచ్’ అనే సినిమాకు గానూ నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. ఇక ‘దయా’ వెబ్ సిరీస్‌కు వచ్చేసరికి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందులో జేడీ చక్రవర్తి పాత్ర, ఆ పాత్రను మలిచిన తీరు, ఇచ్చిన ట్విస్టులు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి.

Updated Date - 2023-11-03T07:42:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!