Vijay Devarakonda : శ్రీకాకుళానికి చెందిన చిన్నారికి రూ.లక్ష సాయం

ABN, First Publish Date - 2023-11-03T16:32:25+05:30

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా హిట్‌ సందర్భంగా కోటి రూపాయలను వంద కుటుంబాలకు సాయంగా అందించిన సంగతి తెలిసందే. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు మరో చిన్నారి జీవితంలో ఆయన ఆనందం నింపారు.

Vijay Devarakonda : శ్రీకాకుళానికి చెందిన చిన్నారికి రూ.లక్ష సాయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా హిట్‌ సందర్భంగా కోటి రూపాయలను వంద కుటుంబాలకు సాయంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు మరో చిన్నారి జీవితంలో ఆయన ఆనందం నింపారు. ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన ఓ చిన్నారికి రూ. లక్ష సాయం అందచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన షర్మిల శ్రీ ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తన అభిమాన సంఘాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న విజయ్‌ వెంటనే ఆ చిన్నారికి రూ. లక్ష చెక్‌ అందేలా చేశారు. ఈ చెక్‌ను శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆ పాపకు అందించారు. (one lakh Donation)

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. ఎక్కడో శ్రీకాకుళంలో కష్టాల్లో ఉన్న షర్మిళ శ్రీకి, హైదరాబాద్‌లో సినిమాలు చేస్తున్న వ్యక్తి స్పందించి సాయం చేయడం గొప్ప విషయం. అది ఆయన మంచి మనసును చాటుతుందని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం విజయ్‌ 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా అలరించనుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ గ్లింప్స్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-11-03T16:42:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!