సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Skanda : మాస్‌ కాంబో ఓటీటీని ఊపేస్తోంది!

ABN, First Publish Date - 2023-11-03T11:58:37+05:30

మాస్‌ సినిమాల మేకింగ్‌లో మేటి బోయపాటి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram pothineni) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ మసాలా చిత్రం ‘స్కంద’ (Skanda). థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఈ నెల 2 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ (Disney plus hotstar) స్ట్రీమింగ్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మాస్‌ సినిమాల మేకింగ్‌లో మేటి బోయపాటి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram pothineni) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ మసాలా చిత్రం ‘స్కంద’ (Skanda). థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఈ నెల 2 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ (Disney plus hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. కమర్షియల్‌ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు, ఒక సినిమా నుంచి సగటు ప్రేక్షకులు ఆశించే అన్ని రసాలు, ఎమోషన్స్‌ అందిస్తున్న స్కంద’ సినిమా ఫ్యామిలీ ప్యాక్‌. పొలిటికల్‌ డ్రామాగా అలరిస్తోంది. అర్థవంతమైన ఎమోషనల్‌ సీన్సతో ఫ్యామిలీ ఆడియన్సని, యాక్షన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల్ని సమంగా మెప్పించింది ‘స్కంద’.

రెండు భిన్నమైన పాత్రల్లో ఎంటర్‌టైన చేసిన రామ్‌ ఈ సినిమాకు ఓ ఆకర్షణ అయితే దర్శకుడు రాసుకున్న పదునైన కథ, కథనం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల (shree leela) ఈ చిత్రంలో కథానాయికగా నటించగా సాయి మంజ్రేకర్‌, ప్రిన్స్‌, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్‌, శరత్‌ లోహితాశ్వ, పృథ్వీరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తమన మరోసారి తనదైన శైలి సంగీతంతో అలరించారు. కుటుంబం అందరికీ నచ్చే ఈ సినిమాని ‘డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌’లో మిస్‌ అవ్వకండి.

Updated Date - 2023-11-03T11:58:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!