TFI- Ram charan: చరణ్‌ అంటే ఈర్ష్యనా? దాని వల్ల వచ్చిన మౌనమా?

ABN , First Publish Date - 2023-02-26T20:31:55+05:30 IST

రామ్‌చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక జెలసీ వల్ల వచ్చిన మౌనమా’ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ అమెరికాలో ఉన్నారు. శనివారం జరిగిన ప్రతిష్ఠాత్మక హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డు వేడుకలతో రాజమౌళితో కలిసి పురస్కారాలు అందుకున్నారు.

TFI- Ram charan: చరణ్‌ అంటే ఈర్ష్యనా?  దాని వల్ల వచ్చిన మౌనమా?

'రామ్‌చరణ్‌ను (Jealous on Ram charan) చూసి ఈర్ష్యనా? లేక జెలసీ వల్ల వచ్చిన మౌనమా’ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ అమెరికాలో ఉన్నారు. శనివారం జరిగిన ప్రతిష్ఠాత్మక హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (HCA awards) అవార్డు వేడుకలతో రాజమౌళితో కలిసి పురస్కారాలు అందుకున్నారు. అంతే కాదు ఈ వేడుకలో రామ్‌చరణ్‌ వ్యాఖ్యాతగా మెరవడమే కాకుండా ఉత్తమ వాయిస్‌, మోషన్‌ క్యాప్చర్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు హాలీవుడ్‌ పాపులర్‌ టెలివిజన్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ షోలో పాల్గొని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. దీంతో ఎక్కడ చూసినా రామ్‌చరణ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ గురించే ప్రస్తావన. ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ షోలో పాల్గొనడం వల్ల రామ్‌చరణ్‌ పేరు మరింత పాపులర్‌ అయింది. కొద్దిరోజులుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం పేరు అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతున్న సంగతి తెలిసిందే! (Jealous on RRR and Ram charan)

Untitled-1.jpg

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాకు, ఓ వ్యక్తికి చిన్న అవార్డు ప్రకటిస్తేనే... ప్రశంసలు వెల్లువెత్తుతాయి. అలాంటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన సినిమా అంతర్జాతీయ వేదికపై ఒకేసారి ఐదు విభాగాల్లో అవార్డులు అందుకోవడం అంత విశేషం కానట్లు పరిశ్రమ, అందులో వివిధ రకాల శాఖలు, సంస్థ చప్పుడు లేకుండా ఉన్నాయి. అంతేకాకుండా ఓ తెలుగు హీరో తొలిసారి అమెరికాలో ఫేమస్‌ అయిన టెలివిజన్‌ టాక్‌ షో పాల్గొవడం తెలుగు నటుడిగా దక్కిన గౌరవంగా నెట్టింట కీర్తిస్తున్నారు. అయితే రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు దగ్గరున్న వారు మినహా పరిశ్రమకు సంబంధించిన అసోసియేషన్లు గానీ, ఇతరులు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతం నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. ఇదే ఇప్పుటు ట్విట్టర్‌లో వైరల్‌ అవుతుంది.

5.jpg

‘‘చరణ్‌ అంటే ఈర్ష్యనా? లేక జెలసీ వల్ల వచ్చిన మౌనమా?

చరణ్‌.. చరణ్‌.. చరణ్‌.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. కానీ సినిమా కులం మాత్రం తమకేమీ పట్టనట్లుగా చూస్తూ ఊరుకుంది’’ అనే పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

RRR.jpg

Updated Date - 2023-02-27T13:39:45+05:30 IST

Read more