సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Hrithik Shourya : అశ్వధామ ఫస్ట్‌ లుక్‌

ABN, First Publish Date - 2023-11-07T22:40:10+05:30

హృతిక్‌ శౌర్య (Hrithik Shourya) , వరలక్ష్మీ శరతకుమార్‌ (Varalakshmi sarathkumar) కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'అశ్వధామ’ (Ashwadhama). 'హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్  స్టూడియో సంస్థ నిర్మిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666


హృతిక్‌ శౌర్య (Hrithik Shourya) , వరలక్ష్మీ శరతకుమార్‌ (Varalakshmi sarathkumar) కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'అశ్వధామ’ (Ashwadhama). 'హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్  స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది. హృతిక్‌ శౌర్య 'ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్‌ ప్రారంభించారు. అందులో సాఫ్ట్‌ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో ప్రొపర్‌ కమర్షియల్‌ హీరోగా కనిపించనున్నారు. 


ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్‌ షేడున్న పాత్రలో ఒక సర్‌ప్రైజ్‌ ఆర్టిస్ట్‌ కనిపిస్తారు. హీరోకి మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్‌ హీరోగా ఎలివేట్‌ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి టీమ్‌ అంతా ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్  చిత్రీకరించాం’’ అని అన్నారు.

Updated Date - 2023-11-07T22:44:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!