Vyuham Movie : సెన్సార్ సభ్యులు తిరస్కరణ.. కారణం అదే!
ABN , First Publish Date - 2023-11-02T18:24:20+05:30 IST
గత ఎలక్షన్ల సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో హడావిడి చేశాడు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో 'వ్యూహం’ అనే సినిమాతో హల్చల్ చేయబోతున్నాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత జరిగిన అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఆర్జీవీ ఇప్పటికే చెప్పాడు.

గత ఎలక్షన్ల సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో హడావిడి చేశాడు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో 'వ్యూహం’ (vyuham) అనే సినిమాతో హల్చల్ చేయబోతున్నాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత జరిగిన అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఆర్జీవీ ఇప్పటికే చెప్పాడు. అజ్మల్(Azmal) , మాసన రాధాకృష్ణ (Manasa) కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాసకి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్స్ నుంచి షాక్ తగిలింది. ఇటీవల చిత్రాన్ని సెన్సార్‌కు పంపారు ఆర్జీవీ. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డ్ సభ్యులు నిరాకరించారు. దీంతో నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేయనున్నారు. సినిమా అంత వ్యక్తిగత వ్యవహారాలు, ఇతరుల మనోభావాలను కించపరిచే విఽధంగా ఉన్నాయన్న కారణంతో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిందని తెలుస్తోంది.