Trisha : ఎక్కువగా విజయ్‌తోనే.. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి!
ABN, First Publish Date - 2023-11-03T11:20:46+05:30
నాలుగు పదుల వయసులో ఉన్నా తరగని అందం త్రిషది. ప్రస్తుతం కోలీవుడ్‌ల మంచి రైజింగ్‌లో ఉన్న నటి ఎవరంటే త్రిష పేరే చెబుతారు. దాదాపు 25 ఏళ్లగా దక్షిణాదిన కథానాయికగా కొనసాగుతుంది. విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. తాజాగా విజయ్‌తో 'లియో’ చిత్రంలో సందడి చేసింది.
నాలుగు పదుల వయసులో ఉన్నా తరగని అందం త్రిషది(Trisha). ప్రస్తుతం కోలీవుడ్‌ల మంచి రైజింగ్‌లో ఉన్న నటి ఎవరంటే త్రిష పేరే చెబుతారు. దాదాపు 25 ఏళ్లగా దక్షిణాదిన కథానాయికగా కొనసాగుతుంది. విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. తాజాగా విజయ్‌తో 'లియో’ (leo) చిత్రంలో సందడి చేసింది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన లియో చిత్ర విజయోత్సవ వేడుకలో త్రిష మాట్లాడారు. దర్శకుడు ఈ కథను రెండున్నర గంటలపాటు నెరేట్ చేసిన తీరు తనను ఆశ్చర్యానికి గుర్తు చేసిందని అన్నారు. త్రిష మాట్లాడుతూ "లోకేశ్ కనకరాజ్ నన్ను కలిసినప్పుడు ఏం చెప్పారో అదే తెరపై ఆవిష్కరించారు. విజయ్ (Vijay) సరసన నటించడం మరిచిపోలేని అనుభవం. స్కూల్లో ఫ్రెండ్స్ కొన్నేళ్ల తర్వాత కలిేస్త ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి నాకు కలిగింది. నా కెరీర్‌లో ఎక్కువ చిత్రాలు చేసింది విజయ్‌తోనే. విజయ్ నెమ్మదితనం, సింప్లిసిటీ ఆయన విజయానికి కారణం. నా స్నేహితులు విజయ్ మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తావని కలిసిన ప్రతిసారీ అడుగుతారు. లియోతో అది ఇన్నాళ్లకు జరిగింది. 15 ఏళ్ల తర్వాత కూడా మా కింబినేషన సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ అయింది. హీరోయిన్స్ కి పతనాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అన్నివేళలా సంతోషంగా ఉండాలి. అలా ఉండటం వల్లే నా స్థానాన్ని నిలబెట్టుకుని ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అన్నారు.