సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Junior Balaiah: జూనియర్‌ బాలయ్య ఇకలేరు

ABN, First Publish Date - 2023-11-03T15:04:14+05:30

అలనాటి మేటి నటుడు టీఎస్‌ బాలయ్య కుమారుడు రఘు బాలయ్య అలియాస్‌ జూనియర్‌ బాలయ్య (70) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Tamil Actor Junior Balaiah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అలనాటి మేటి నటుడు టీఎస్‌ బాలయ్య (TS Balaiah) కుమారుడు రఘు బాలయ్య (Raghu Balaiah) అలియాస్‌ జూనియర్‌ బాలయ్య (70) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్థానిక వలసరవాక్కం, వాంజినాథన్‌ వీధిలో ఉన్న ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సినీ ప్రముఖుల, అభిమానుల సందర్శనార్థం ఉంచి, గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతిపట్ల నడిగర్‌ సంఘం నిర్వాహకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. (Junior Balaiah No More)

1975లో విడుదలైన ‘మేల్‌నాట్టు మరుమగల్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన జూనియర్‌ బాలయ్య... ‘గోపుర వాసలిలే’, ‘కరగాట్టకారన్‌’, ‘చిన్నతాయి’, ‘సంగమం’, ‘విన్నర్‌’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హీరో అజిత్‌ నటించిన ‘నెర్కొండపార్వై’ చిత్రంలోనూ ఆయన ఓ ముఖ్య పాత్ర పోషించారు. 2011లో విడుదలైన ‘ఎన్నాంగ సర్‌ ఉంగ చట్టం’ చిత్రంలో చివరిసారి నటించారు. అప్పటి నుంచి ఆయన చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్నారు. సినిమాలోనే కాకుండా ‘చిత్తి’, ‘చిన్న పాపా పెరియ పాపా’ వంటి పలు టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించారు.


jr-Balaiah.jpg

రఘు బాలయ్య అలియాస్‌ జూనియర్‌ బాలయ్య మరణ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan), అజిత్ కుమార్ (Ajith Kumar) వంటి స్టార్ హీరోలు.. రఘు బాలయ్య చాలా మంచి నటుడని, ఆయన మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటుగా చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

========================

*Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

**************************************

Updated Date - 2023-11-03T15:04:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!