The Road: ఓటీటీలోకి త్రిష థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
ABN, First Publish Date - 2023-11-08T12:59:09+05:30
ఇటీవల మంచి ఫామ్ లో దూసుకుపోతున్న తారల్లో సీనియర్ నటి త్రిష ముందు వరుసలో ఉంది. అయితే ఆమె నటించిన ది రోడ్ అనే చిత్రం దసరా సందర్బంగా తమిళనాట విడుదలై మంచి పేరు తెచ్చుకున్నది .ఇప్పుడు ఈ సినిమాను ఈ దీపావళికి ప్రముఖ ఓటీటీ ఆహలో తెలుగులో స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నారు. మొదటి నుంచి చివరి వరకు మంచి సీట్ఎడ్జ్ థ్రిల్లర్ గా ఈచిత్రం రూపొందింది.

ఇటీవల మంచి ఫామ్ లో దూసుకుపోతున్న తారల్లో సీనియర్ నటి త్రిష (Trisha Krishnan) ముందు వరుసలో ఉంది. ఈమధ్య ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్1, 2, లియో చిత్రాలు మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. వరుసబెట్టి సినిమా అవకాశాలకు దక్కించుకుంటూ పోతుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటిన నేటి యువ కథానాయికలకు ధీటుగా సినిమాలు చేస్తూ పోటీనిస్తున్నది.
ఇటీవల లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాలో విజయ్ తో ఘాటు లిప్ లాక్ చేసి యువ హీరోయిన్లకు తక్కువేమీ కాదని నిరూపించింది. త్రిష(Trisha Krishnan) ప్రస్తుతం స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో నటించకున్నా కమల్ హసన్, అరవింద్ స్వామి చిత్రాలతో ఫాటు మరో అర డజన్ కు పైగా తమిళ, కన్నడ సినిమాలలో, మహిళా ప్రాధాన్య సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అయితే దసరా సందర్భంగా తమిళనాట విడుదలై మంచి పేరు తెచ్చుకున్న ది రోడ్(The Road) అనే సినిమాను ఈ దీపావళికి ప్రముఖ ఓటీటీ ఆహలో తెలుగులో స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నారు. నిజ జీవిత కథల ఆధారంగా వశీకరన్ దర్వకత్వం వహించిన ఈ మూవీ మొదటి నుంచి చివరి వరకు మంచి సీట్ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందింది. పదేపదే ఒకే ప్రాంతంలో యాక్సిడెంట్స్ జరగడం దాని వెనక రహస్యం తెలుసుకునే ప్రయత్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను చూడాలంటే మరో రెండు రోజులు ఆగక తప్పదు.