సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Varun Tej Lavanya marriage: రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన పెళ్లి వీడియో?

ABN, First Publish Date - 2023-11-07T18:18:47+05:30

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసిందని, అది త్వరలో ప్రసారం కానుంది అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో...

The newly married couple Varun Tej and Lavanya Tripathi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ల వివాహం ఇటలీలోని టస్కానీలోని కొన్ని రోజుల క్రితం ఘనంగా జరిగింది. #VarunLav నూతన దంపతులు హైదరాబాద్ లో రిసెప్షన్‌ ఇచ్చారు, ఇక్కడ ఇంకో రెసెప్షన్ కూడా ఉంటుంది, అలాగే త్వరలో డెహ్రాడూన్‌లో మరో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వటం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి, అక్కడ కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రం ఈ రెసెప్షన్ కి వస్తున్నారు అని భావిస్తున్నారు. #MegaWedding

ఇదిలా ఉండగా ప్రఖ్యాత OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వివాహాన్ని ప్రసారం చేసే హక్కులను రూ. 8 కోట్ల రూపాయలకు ప్రత్యేకంగా కొనుగోలు చేసిందని వార్తలు వ్యాపించాయి. ఇంతకు ముందు చాలామంది సెలబ్రిటీ వివాహాలు ఇలా ఓటిటి లో ప్రసారం చేశారు, కాబట్టి ఈ వివాహం కూడా ఓటిటి లో ప్రసారం కానుంది అని అభిమానులు ఈ వేడుక చూడటానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

varuntejlavanyatripathimarr.jpg

అయితే ఈ వార్త కేవలం ఒక పుకారు అని, అటువంటిది ఏమీ లేదని వరుణ్ తేజ్ టీము ఈ వార్త మీద ఒక అధికార ప్రకటన జారీ చేసింది.

"వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి సంబంధించిన OTT హక్కుల గురించి జరుగుతున్న ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవమైనవి. అలాంటి పుకార్లను నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని అభ్యర్థిస్తున్నాము", అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ జంట తమ ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యక్తిగత, కుటుంబ గౌరవం కోసం ఎప్పటికీ రాజీ పడదని నొక్కిచెప్పారు, వారు స్వీకరించే ఆఫర్‌లతో సంబంధం లేకుండా. మెగా ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం కలిగించే ఎలాంటి పుకార్లకు నమ్మవద్దని ఈ ప్రకటనలో కోరారు.

Updated Date - 2023-11-07T18:18:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!