సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Venkatesh: కార్తీక్‌ సుబ్బరాజ్‌ నా కోసం ఓ స్ర్కిప్టు చేస్తాడేమో?

ABN, First Publish Date - 2023-11-06T00:34:20+05:30

లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ఎల్‌’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. కార్తికేయన్‌ నిర్మించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ఎల్‌’. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. కార్తికేయన్‌ నిర్మించారు. ఈనెల 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘జిగర్‌ తండ ట్రైలర్‌ చూశా. అదిరిపోయింది. కార్తిక్‌ ప్రతిభావంతమైన దర్శకుడు. నా కోసం ఓ స్ర్కిప్టు చేస్తాడేమో చూడాలి. లారెన్స్‌ కొరియోగ్రాఫర్‌ నుంచి మంచి నటుడిగా మారాడు. సూర్య ‘ఖుషి’లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తీసిన దర్శకుడు. సంతోష్‌ నారాయణ్‌ నేపథ్య సంగీతం బాగుంటుంది. నా ‘గురు’ సినిమాలో పని చేశాడు. నాతో ఓ పాట కూడా పాడించాడు. వీళ్లందరూ కలిసి పనిచేసిన ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంద’’న్నారు. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఈ క్రెడిట్‌ మొత్తం దర్శకుడికే దక్కుతుంద’’న్నారు లారెన్స్‌. ‘‘పెద్ద పెద్ద డైలాగ్స్‌ని కూడా లుక్స్‌ ద్వారా ఎలా చెప్పాలనే విషయాన్ని ఈ సినిమాతో నేర్చుకొన్నా’’ అని సూర్య తెలిపారు. ‘‘నా సినిమా థియేటర్లో విడుదలై దాదాపు నాలుగున్నర సంవత్సరాలైంది. ఎవ్వరినీ ఈ సినిమా నిరాశ పరచదు’’ అన్నారు దర్శకుడు.

Updated Date - 2023-11-06T01:00:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!