పెళ్లి సందడి
ABN, First Publish Date - 2023-11-06T00:29:49+05:30
నటి అమలాపాల్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ని వివాహమాడారు. ఆదివారం కొచ్చిలో వీరిద్దరి పెళ్లి సింపుల్‌గా జరిగింది...
నటి అమలాపాల్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ని వివాహమాడారు. ఆదివారం కొచ్చిలో వీరిద్దరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘బెజవాడ’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు అమలాపాల్. ఆ తరవాత దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకొన్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే వీరిద్దరూ చట్ట ప్రకారం విడిపోయారు. ఆ తరవాత జగత్‌తో పరిచమైంది. ఇప్పుడు వీరిద్దరి స్నేహం పెళ్లి వరకూ వచ్చింది.