ఈ ఘనత వారికే దక్కుతుంది
ABN , First Publish Date - 2023-11-05T00:32:39+05:30 IST
‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. సినిమాలోని నటీనటులు, నిర్మాత గౌరీకృష్ణ, వంశీకు ఈ ఘనత దక్కుతుంద’ని నిర్మాత బన్నీవాసు అన్నారు...

‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. సినిమాలోని నటీనటులు, నిర్మాత గౌరీకృష్ణ, వంశీకు ఈ ఘనత దక్కుతుంద’ని నిర్మాత బన్నీవాసు అన్నారు. శనివారం చిత్రబృందం నిర్వహించిన ‘పొలిమేర 2’ సక్సె్‌సమీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరీకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఘన విజయం మేం పడిన కష్టం అంతా మర్చిపోయేలా చేసింది. నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది’ అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో మమ్మల్ని ముందుకు నడిపించిన బన్నీవాస్, వంశీ నందిపాటి, మా నిర్మాతకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ చెప్పారు. ‘పొలిమేర 2’ ఇంత పెద్ద విజయం సాధించడం చిత్రబృందానికి ఆనందాన్నిచ్చిందని సత్యం రాజేశ్ తెలిపారు.