దీపావళి వెలుగుల్లో సత్యభామ

ABN , First Publish Date - 2023-11-06T00:32:54+05:30 IST

కాజల్‌ అగర్వాల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది...

దీపావళి వెలుగుల్లో సత్యభామ

కాజల్‌ అగర్వాల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. దీపావళి సందర్భంగా ఈనెల 11న టీజర్‌ విడుదల చేయనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ ఈ సినిమా. కాజల్‌ ఇమేజ్‌ని పూర్తిగా మారుస్తుంది. ‘మేజర్‌’ చిత్రంతో ఆకట్టుకొన్న శశికిరణ్‌ తిక్క అందించిన స్ర్కీన్‌ ప్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటీవల హైదరాబాద్‌లో కాజల్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించామ’’న్నారు.

Updated Date - 2023-11-06T00:32:56+05:30 IST