Ravi Teja - Eagle : పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో 'ఈగల్‌' టీజర్‌!

ABN, First Publish Date - 2023-11-06T12:27:13+05:30

కొండలోని లావాను కిందకి పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు’ అంటున్నారు మాస్‌ మహారాజా రవితేజ (Raviteja) ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'ఈగల్‌’. కార్తిక్‌ ఘట్టమనేని (karthik ghttamaneni) దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక.

Ravi Teja - Eagle : పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో 'ఈగల్‌' టీజర్‌!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

'కొండలోని లావాను కిందకి పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు’ అంటున్నారు మాస్‌ మహారాజా రవితేజ (Raviteja) ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'ఈగల్‌’. కార్తిక్‌ ఘట్టమనేని (karthik ghttamaneni) దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సోమవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. యాక్టన్  కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో

'అడవిలో ఉంటాడు.. కనిపించడు.. కానీ వ్యాపించి ఉంటాడు..

వెలుతురు వెళ్లే ప్రతి చోటుకి వాడి బుల్లెట్‌ వెళ్తుంది..

ఇది విధ్వంసం మాత్రమే తర్వాత చూడబోయేది విశ్వరూపం’

అంటూ సాగే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. పంచె కట్టు, బాగా పెరిగిన జుట్టుతో మాస్‌ లుక్‌లో కనిపించారు రవితేజ. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, కావ్య థాపర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ మాస్సీ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Updated Date - 2023-11-06T12:33:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!