కొత్త రాఘవ లారెన్స్‌ను చూస్తారు
ABN, First Publish Date - 2023-11-08T00:57:38+05:30
రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజన్ దర్శకుడు. ఈ నెల 10న విడుదలవుతోంది...
రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజన్ దర్శకుడు. ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మీడియాతో మాట్లాడుతూ ‘‘జిగర్‌తండ’ సినిమా నేనే చేయాల్సింది. కానీ మిస్సయింది. దీంతో రెండో భాగంలో నటిద్దామని కార్తీక్ సుబ్బరాజ్‌ను అడిగాను. ఇది పీరియాడిక్ మూవీ . ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. యాక్షన్‌పార్ట్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉంది. నేను గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాను. ప్రేక్షకులు కొత్త రాఘవ లారెన్స్‌ను చూస్తారు. నేను డైరెక్షన్‌లో వేలు పెట్టలేదు. సుబ్బరాజు గారు చెప్పినట్లు చేశాను. రజనీకాంత్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నానంటూ వచ్చిన వార్తలపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. ప్రస్తుతం ‘ముని 5’, ‘కాంచన 4’ చిత్రాలు చేస్తున్నాను’ అన్నారు. ఎస్ జే సూర్య మాట్లాడుతూ ‘జిగర్‌తండ డబుల్ ఎక్స్’ సినిమాను రూ.100 కోట్లకు పైనే ఖర్చుపెట్టి నిర్మించారు. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది. ఇందులో నేను దర్శకుడి పాత్రను పోషించాను. వాణిజ్య హంగులతో పాటు మంచి సందేశం ఉంది. నా డైరెక్షన్‌లో హీరోగా ఓ చిత్రం చేస్తున్నాను’ అన్నారు.