సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Shantala: రెండో పాట వదిలిన కింగ్.. పాట ఎవరు ఆలపించారో తెలుసా?

ABN, First Publish Date - 2023-11-03T19:37:46+05:30

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పణలో.. ‘ఫ్యామిలీమ్యాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో.. నీహల్ హీరోగా, త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం ‘శాంతల’. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘చెలి మొహమే’ అంటూ సాగే పాటను హీరో కింగ్ నాగార్జున విడుదల చేశారు. పాటను వీక్షించిన అనంతరం చాలా బాగుందంటూ.. చిత్రయూనిట్‌కు నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు.

Shantala Movie Team with King Nagarjuna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కెఎస్ రామారావు (KS Ramarao) సమర్పణలో.. ‘ఫ్యామిలీమ్యాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో.. నీహల్ హీరోగా, త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం ‘శాంతల’ (Shantala). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘చెలి మొహమే’ అంటూ సాగే పాటను హీరో కింగ్ నాగార్జున (King Nagarjuna) విడుదల చేశారు. పాటను వీక్షించిన అనంతరం చాలా బాగుందంటూ.. చిత్రయూనిట్‌కు నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు.

‘చెలి మొహమే’ పాట విషయానికి వస్తే.. ఈ పాటను ఎస్‌పిబి చరణ్ (SPB Charan) పాడారు. ‘సీతారామం’ (Sita Ramam) సినిమాలో చరణ్ పాడిన పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఆయన వాయిస్‌లో ఉన్న మ్యాజిక్ అలాంటిది. ఈ పాట కూడా ఆయన వాయిస్‌‌కు పర్ఫెక్ట్‌గా సెట్టయింది. కృష్ణ కాంత్ పాటకు సాహిత్యం అందించగా.. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandra Shekhar) సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Shantala-Pic.jpg

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రంలోని రెండో పాటని హీరో కింగ్ నాగార్జున విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో బిజీగా ఉండి కూడా మాకు టైమ్ కేటాయించి.. పాట మొత్తం వీక్షించి శుభాకాంక్షలు తెలిపిన ఆయనకి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. హళిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించామని.. నవంబర్ 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. (Shantala Release Date)


ఇవి కూడా చదవండి:

========================

*Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

**************************************

*Junior Balaiah: జూనియర్‌ బాలయ్య ఇకలేరు

*************************************

*Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

**************************************

Updated Date - 2023-11-03T19:37:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!