జపాన్‌ కూడా అంత పాపులర్‌ అవుతుంది

ABN , First Publish Date - 2023-11-06T00:28:25+05:30 IST

కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జపాన్‌’. రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌ ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌. ఆర్‌ ప్రభు నిర్మించారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక...

జపాన్‌ కూడా అంత పాపులర్‌ అవుతుంది

కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జపాన్‌’. రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌ ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌. ఆర్‌ ప్రభు నిర్మించారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ ప్రభు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • రాజుమురుగన్‌ ఆలోచనలు విలక్షణంగా ఉంటాయి. నవ్విస్తూనే ఆలోచింపజేస్తారు. ఆయన చెప్పిన కథ కార్తి కి బాగా నచ్చడంతో ‘జపాన్‌’ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. కార్తిగారి డైలాగ్‌ ‘ఎవర్రా మీరంతా...’ బాగా పాపులర్‌. అలాగే ఇప్పుడు జపాన్‌ పాత్ర ప్రేక్షకుల మనస్సుల్లో చాలా కాలం నిలిచిపోతుంది. కథ కొత్తగా ఉండి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. కార్తి గెటప్‌, వాయిస్‌, మాడ్యులేషన్‌... అన్నీ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అందుకే ఇప్పటికే ‘జపాన్‌’ సినిమా చూడాలనే కోరిక ప్రేక్షకుల్లో బలంగా నాటుకుంది.

  • అనూ ఇమ్మాన్యుయేల్‌ పాత్ర కూడా ఊహాతీతంగా సాగుతుంది. జీవీ ప్రకాశ్‌ సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. రవివర్మన్‌ విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. ట్రైలర్‌ చూసి నాగార్జున గారు అభినందించారు. ప్రస్తుతం కీర్తిసురేశ్‌తో ‘కన్నివెడి’ అనే సినిమా, రష్మిక మందన్నతో ‘రెయిన్‌బో’ చిత్రం చేస్తున్నాం.

Updated Date - 2023-11-06T00:28:29+05:30 IST