సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Janam: ప్రజల్ని మార్చేందుకు సిద్ధమైన ‘జనం’.. ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2023-11-03T07:01:35+05:30

రానున్న ఎలక్షన్స్ ముందు దర్శకుడు వెంకటరమణ పసుపులేటి ప్రజలకు ప్రజల్ని ఒకసారి తెరమీద పరిచయం చేసి.. ప్రజల్లో మార్పుని ఆకాక్షించి, రాసుకుని, తెరకెక్కించిన చిత్రం ‘జనం’. నవంబర్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Ajay Ghosh in Janam Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రానున్న ఎలక్షన్స్ ముందు దర్శకుడు వెంకటరమణ పసుపులేటి ప్రజలకు ప్రజల్ని ఒకసారి తెరమీద పరిచయం చేసి.. ప్రజల్లో మార్పుని ఆకాక్షించి, రాసుకుని, తెరకెక్కించిన చిత్రం ‘జనం’ (Janam). రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారనే ఘాటైన చర్చను రాజేసే ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. కథతో పాటు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాసుకుని వి.ఆర్.పి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు వెంకటరమణ పసుపులేటి (Pasupuleti Venkata Ramana) ఈ చిత్రాన్ని నిర్మించారు. (Janam Release Date)

ఈ మధ్య విడుదలైన ట్రైలర్ ప్రస్తుత సమాజాన్ని కళ్ళ ముందు నిలిపి, సినిమాపైన ఆసక్తిని పెంచే విధంగా ఉంది. కథ విషయానికొస్తే ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచాలనుకుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది. ప్రజలకు ఎంతో మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు.. ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్‌లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపై నడిచే గొప్ప కథ.


Hero Suman

దర్శకుడు ఈ కథకు పూర్తి న్యాయం చేసేలా నటుల్ని కూడా ఎంపిక చేసుకున్నారు. సుమన్ (Suman), అజయ్ ఘోష్ (Ajay Ghosh) లాంటి వారితో పాటు కే కిషోర్, వెంకట రమణ, ప్రగ్యా నయన్, మౌనిక, లక్కీ, జయవాని, రషీదా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి పి పద్మావతి సమర్పించగా, డాక్టర్ సైమల్లి అరుణ్ కుమార్ సహా నిర్మాతగా వ్యవహారించారు. చిన్నా నేపథ్య సంగీతం అందించగా, రాజ్ కుమార్ పాటల్ని సమాకూర్చారు.

Updated Date - 2023-11-03T07:01:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!