SSMB29: ముహూర్తం ఖరారైందా?
ABN, First Publish Date - 2023-11-08T01:04:44+05:30
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే స్ర్కిప్టు పనులు ఓ కొలిక్కివచ్చేసినట్టు సమాచారం...
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే స్ర్కిప్టు పనులు ఓ కొలిక్కివచ్చేసినట్టు సమాచారం. ఇప్పుడు సినిమా ప్రారంభానికి ముహూర్తం కూడా కుదిరినట్టు తెలుస్తోంది. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్‌లో షూటింగ్ మొదలెట్టాలని భావిస్తున్నార్ట.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ కథ ఇది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1000 కోట్లని తెలుస్తోంది. కొన్ని హాలీవుడ్ స్టూడియోలు ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొనే అవకాశాలు ఉన్నాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.