కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌

ABN , First Publish Date - 2023-11-04T00:25:40+05:30 IST

‘ఏ తప్పు జరిగినా నేను మళ్లీ తిరిగి వస్తాను’.. అంటూ ‘భారతీయుడు’లో మాట ఇచ్చాడు కమల్‌ హాసన్‌. అన్నట్టుగానే ఇప్పుడు మళ్లీ అవినీతిని అంతమొందించడానికి కదన రంగంలోకి దిగుతున్నాడు.

కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌

‘ఏ తప్పు జరిగినా నేను మళ్లీ తిరిగి వస్తాను’.. అంటూ ‘భారతీయుడు’లో మాట ఇచ్చాడు కమల్‌ హాసన్‌. అన్నట్టుగానే ఇప్పుడు మళ్లీ అవినీతిని అంతమొందించడానికి కదన రంగంలోకి దిగుతున్నాడు. కమల్‌హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఇండియన్‌ 2’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్‌ నిర్మాత. శుక్రవారం ‘భారతీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్‌ ఆసక్తికరంగా సాగింది. దేశంలో లంచగొండితనం పెరిగిపోవడంతో విసిగెత్తిపోయిన ప్రజలు.. ‘కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌’ అంటూ భారతీయుడ్ని స్వాగతిస్తూ హ్యాష్‌ ట్యాగులతో ఓ ఉద్యమమే చేస్తారు. చివరికి భారతీయుడు తిరిగి వస్తాడు. అక్కడి నుంచి ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. రవి వర్మన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌: టి.ముత్తురాజ్‌.

Updated Date - 2023-11-04T00:44:57+05:30 IST