అశ్వత్థామ హతః అక్షర!
ABN , First Publish Date - 2023-11-08T01:01:16+05:30 IST
‘ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంబించిన హృతిక్ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వత్థామ’. ‘హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల...

‘ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంబించిన హృతిక్ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వత్థామ’. ‘హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్,క్రైమ్ థ్రిల్లర్ ఇది. పక్కా కమర్షియల్ అంశాలతో సినిమా ఉంటుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ పాత్రలో సర్‌ప్రైజ్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. ఈ చిత్రంతో హీరోగా హృతిక్ శౌర్య కమర్షియల్ హీరోగా ఎదుగుతారు. ఇప్పటివరకూ జరిగిన రెండు షెడ్యూల్స్‌లో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్లు తీశాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, సంగీతం: ప్రజ్వల్ కుమార్, సాహిత్యం: తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ ఉప్పలపాటి.