ఆనంద్‌ దేవర కొండ డ్యూయట్‌

ABN , First Publish Date - 2023-11-04T00:34:10+05:30 IST

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘డ్యూయట్‌’ మొదలైంది. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.

ఆనంద్‌ దేవర కొండ డ్యూయట్‌

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘డ్యూయట్‌’ మొదలైంది. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు మిథున్‌ వరదరాజ కృష్ణన్‌ తెరకెక్కిస్తున్నారు. రితికా నాయక్‌ హీరోయిన్‌. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ క్లాప్‌ ఇచ్చారు. చందు మెండేటి గౌరవ దర్శకత్వం వహించారు. ఆనంద్‌ తల్లితండ్రులు గోవ ర్ధన్‌ దేవరకొండ, మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘డ్యూయట్‌’ నాకొక స్పెషల్‌ మూవీ. మిథున్‌ అద్భుతమైన కథ రాశాడు’ అన్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉందని మిథున్‌ చెప్పారు. కథ విన్నప్పుడే ఎంత త్వరగా షూటింగ్‌లో పాల్గొందామా అనే కుతూహలం కలిగిందని రితికా నాయక్‌ తెలిపారు. వారం రోజుల్లో ‘డ్యూయట్‌’ తొలి షెడ్యూల్‌ పూర్తి చేస్తామని జ్ఞాన వేల్‌రాజాతెలిపారు.

Updated Date - 2023-11-04T00:44:35+05:30 IST