సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక్క టిక్కెట్‌పై ఇద్దరికి అవకాశం

ABN, First Publish Date - 2023-11-06T00:31:11+05:30

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం సక్సెస్‌మీట్‌ నిర్వహించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. రక్షిత్‌ మాట్లాడుతూ ‘‘నరకాసుర’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రక్షిత్‌ నటుడిగా మరో మెట్టు ఎక్కాడని ప్రశంసిస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనుకుంటున్నాం. అందుకే వచ్చే గురువారం వరకూ ఒక టిక్కెట్‌పై ఇద్దరికి సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించాలి’ అని ప్రేక్షకులను కోరారు. దర్శకుడు సెబాస్టియన్‌ మాట్లాడుతూ ‘సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెప్పడంతో పాటు ప్రతి విభాగం పనితీరును మెచ్చుకుంటున్నారు’ అని తెలిపారు. నిర్మాత డాక్టర్‌ అజ్జా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘మా సుముఖ క్రియేషన్స్‌కు ‘నరకాసుర’ గుర్తుండిపోయే చిత్రం. నిర్మాణ విలువలు బాగున్నాయని అందరూ అభినందిస్తున్నారు’ అని చెప్పారు.

Updated Date - 2023-11-06T00:31:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!