సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Alia bhatt: నీ జ్ఞాపకాలు పదిలం..

ABN, First Publish Date - 2023-06-01T17:40:54+05:30

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్థాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌ (Alia bhatt) ఇంట విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) (Narendranath Razdan) గురువారం కన్నుమూశారు. వృద్థాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియాభట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఓ పోస్ట్‌ చేశారు. ‘‘తాతయ్యా.. నువ్వే నా హీరో. 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్‌ ఆడావు. చివరి వరకూ పని చేస్తూనే ఉన్నావు. నా కోసం టేస్టీ ఆమ్లెట్‌ వేసిచ్చేవాచివి. చక్కని కథలు చెప్పేవాడివి. వయోలిన్‌ వాయించేవాడివి. నీ ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నావు. నువ్వు క్రికెట్‌ ఆడే విధానం. నీ స్కెచ్‌లన్నా ఎంతో ఇష్టం. చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని ప్రేమించావు(Rip Narendranath Razdan). ఇప్పుడు నువ్వు లేవన్న బాధను నేను తట్టుకోలేకపోతున్నా. కుటుంబ సభ్యుల మనసంతా దుఃఖంతో నిండిపోయింది. మా తాతయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించాలనే ఆనందం కూడా ఉంది. మనం మళ్లీ కలుసుకునే వరకూ ఆ ఆనందాన్ని, మీ జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంటా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. (Narendranath Razdan Isno more)

2.jpg

Updated Date - 2024-01-04T14:49:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!