Aha Naa Pellanta: 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్.. జీ5లో రికార్డ్
ABN , First Publish Date - 2022-12-02T23:26:55+05:30 IST
జీ5 (Zee5)లో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’ (Aha Naa Pellanta). నవంబర్ 17న ‘జీ5’ ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్..

జీ5 (Zee5)లో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’ (Aha Naa Pellanta). నవంబర్ 17న ‘జీ5’ ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ (Web Series) అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ.. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను రీచ్ అయ్యింది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు దక్కించుకోవడం విశేషం. ఇందులోని కంటెంట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుండటంతో.. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనింగ్ సిరీస్‌ను జీ5 వారు ఇప్పుడు.. అన్నీ భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.
ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే ఈ వెబ్ సిరీస్ కథ. కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు.. తన ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అప్పుడా కథానాయకుడు ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది తెలియాలంటే జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. సినీ విమర్శకుల, ఆడియెన్స్‌ను మెప్పిస్తూ.. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి.. కామెడీ వెబ్ సిరీస్‌లలోనే ఈ ‘అహ నా పెళ్ళంట’ ఓ రికార్డ్‌ను నెలకొల్పినట్లుగా జీ5 వర్గాలు వెల్లడించాయి. హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), హీరోయిన్ శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar) మధ్య కెమిస్ట్రీతో పాటు క్లీన్ కామెడీ, రొమాన్స్ అన్నీ హైలెట్‌గా.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా దర్శకుడు ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు. (Superb Response to Aha Naa Pellanta in Zee 5)

Read more