OTT Release: ‘ఆహా’లో ఈ వారం వచ్చే సినిమాలో అన్నీ ట్విస్ట్‌లే!

ABN , First Publish Date - 2022-09-27T21:07:34+05:30 IST

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఓటీటీని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు.. అంతలా ఓటీటీ రోజురోజుకీ ప్రేక్షకుడికి దగ్గరవుతోంది. ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా.. భాషతో సంబంధం లేకుండా

OTT Release: ‘ఆహా’లో ఈ వారం వచ్చే సినిమాలో అన్నీ ట్విస్ట్‌లే!

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఓటీటీని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు.. అంతలా ఓటీటీ రోజురోజుకీ ప్రేక్షకుడికి దగ్గరవుతోంది. ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు. అలా ఓటీటీలతో భాషాబేధం లేకుండా సినిమాలు ప్రేక్షకులు అందుబాటులోకి వచ్చేస్తుండటంతో.. ఇప్పుడు ఈ వారం ఓటీటీలో ఏమేం చిత్రాలు విడుదలవుతున్నాయా? వాటిలో మంచి చిత్రాలు ఏమై ఉంటాయా? అనే మైండ్ సెట్ ప్రేక్షకులలో ఎక్కువవుతోంది. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఈ వారం ‘ఆహా’ ఓటీటీలో ఓ చిత్రం విడుదల కాబోతోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ (Iravukku Aayiram Kangal) అనే సినిమాను ‘రేయికి వేయి కళ్లు’ (Reyiki Veiyi Kallu) పేరిట తెలుగులోకి తీసుకొస్తుంది ‘ఆహా’ (Aha). ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 30న ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


‘రేయికి వేయి కళ్లు’ సినిమా విషయానికి వస్తే.. స్క్రీన్‌ప్లే ప్రధానబలంగా తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా... విజయవంతంగా యాభై రోజులు ఆడి కోలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రివర్స్ ఆర్డర్‌ స్క్రీన్‌ప్లేతో.. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ట్విస్ట్‌లకు ప్రేక్షకులు, విమర్శకులు ఫిదా అవడమేకాక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో సినిమాని గుర్తు చేసేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కాగా.. డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో అరుళ్‌నిధి స్టాలిన్ (Arulnithi Stalin) ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. ము. మారన్ ఈ చిత్రానికి దర్శకుడు. (Reyiki Veiyi Kallu in Aha)

Updated Date - 2022-09-27T21:07:34+05:30 IST

Read more