The Rings of Power: 2022లో అత్యంత ఖరీదైన వెబ్‌సిరీస్‌లు
ABN , First Publish Date - 2022-09-15T22:18:30+05:30 IST
కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్ కాలంలో అందరు వెబ్‌సిరీస్‌లకు అలవాటు పడ్డారు. ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ప్రారంభించారు. అందువల్ల డిజిటల్

కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్ కాలంలో అందరు వెబ్‌సిరీస్‌లకు అలవాటు పడ్డారు. ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ప్రారంభించారు. అందువల్ల డిజిటల్ ప్లాట్‌ఫాంలు కూడా వీక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించడం మొదలు పెట్టాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. సినిమాలను తలదన్నేలా భారీ ఖర్చుతో రూపొందించిన వెబ్‌సిరీస్‌లపై ఓ లుక్కేద్దామా..
భారీ వ్యయంతో రూపొంది 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌సిరీస్ ‘ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్’ (The Lord Of The Rings: The Rings of Power). అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోను దాదాపుగా 465మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. అమెజాన్ ఇప్పటి వరకు రూపొందించిన వెబ్‌సిరీస్‌ల్లో ఇదే అత్యంత ఖరీదైందట. ‘రింగ్స్ ఆఫ్ పవర్’ కు వెచ్చించిన దాంట్లో సగం ఖర్చుతోనే ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-4’ (Stranger Things Season 4)ను రూపొందించారు. ఈ షోను 270మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్‌సిరీస్‌ను 140కోట్ల గంటల పాటు చూశారు.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన ‘సిటాడెల్’ (Citadel) భారీ బడ్జెట్‌తో రూపొందిన వెబ్‌సిరీస్‌ల్లో మూడో స్థానంలో ఉంది. ఈ షోను 250మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘గేమ్ ఆఫ్ ద థ్రోన్స్’ ప్రీక్వెల్ ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ (House of the Dragon) నాలుగో ఖరీదైన షో. ఈ వెబ్‌సిరీస్‌ను 200మిలియన్ డాలర్స్ బడ్జెట్‌తో నిర్మించారు. హెచ్‌బీవో ఈ షోను రూపొందించింది. ‘డిస్నీ+హాట్‌స్టార్’ లోను అందుబాటులో ఉంది. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ రెండో ఎపిసోడ్‌ను 10.2 మిలియన్ మంది వీక్షించారు.
Read more