Dhanush: ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ABN , First Publish Date - 2022-10-22T22:19:36+05:30 IST
విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తాజాగా అతడు

విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘నానే వరువేన్’ (Naane Varuven). ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. కలైపులి ఎస్ థాను (Kalaippuli S. Thanu) నిర్మించాడు. ఈ చిత్రం తెలుగులోను ‘నేనే వస్తున్నా’ (Nene Vasthunna) టైటిల్‌తో విడుదలయ్యింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ధనుష్ నటనకు అందరు ఫిదా అయ్యి పోయారు. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.
‘నేనే వస్తున్నా’ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌పామ్ ప్రైమ్ వీడియో భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ మూవీ అక్టోబర్ 27నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘వెలుగు, చీకటిల మధ్య యుద్ధానికి సిద్ధం కండి. ‘నేనే వస్తున్నా’ అక్టోబర్ 27నుంచి అందుబాటులో ఉంటుంది’’ అని అమెజాన్ ప్రైమ్ తెలిపింది. ధనుష్, సెల్వ రాఘవన్ కలసి చేసిన నాలుగో చిత్రమిది. గతంలో వీరిద్దరు కలసి ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ మూవీస్ చేశారు. ఈ సినిమాలో ప్రభు, యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్ కీలక పాత్రలు పోషించారు.
Read more