Ammu: అమెజాన్ ప్రైమ్‌లో డ్రామా థ్రిల్లర్.. ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2022-10-12T03:52:16+05:30 IST
మణిరత్నం (ManiRatnam) కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 (PS 1)లో పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న నటి ఐశ్వర్య లక్ష్మీ (Ishwarya Laxmi). ఆ సినిమాలో..

మణిరత్నం (ManiRatnam) కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 (PS 1)లో పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న నటి ఐశ్వర్య లక్ష్మీ (Ishwarya Laxmi). ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లోనూ ఆమె గురించి సెర్చ్ చేసే వారు ఎక్కువయ్యారు. ఇప్పుడామె నటించిన డ్రామా థ్రిల్లర్ ‘అమ్ము’ (Ammu) చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video) రెడీ అయింది. గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక వైవిధ్యభరిత చిత్రంగా అనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది. గృహ హింసకు గురైన ఒక అమ్మాయి అమ్ముగా ఇందులో ఐశ్వర్య లక్ష్మి కనిపిస్తుంది. నవీన్ చంద్ర (Naveen Chandra) ఈ సినిమాలో అమ్ము భర్తగా నటించాడు. భార్య భర్తల అనుబంధంతో పాటు వాళ్ళ మధ్య జరిగే గొడవలను కూడా ఈ చిత్రంలో ఆవిష్కరించాడు దర్శకుడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ రచన మరియు దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 19న విడుదలకాబోతోంది.
Read more