NTR: ఎన్టీఆర్‌కు తల్లిగా చేయనన్న హీరోయిన్.. చివరికి?

ABN , First Publish Date - 2022-09-07T01:53:28+05:30 IST

నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో ఓ సినిమా తీసే ప్రయత్నం 1974 లోనే జరిగింది. ఎన్టీఆర్ తో చిక్కడు దొరకడు చిత్రాన్ని నిర్మించిన కుదురవల్లి లక్ష్మీనారాయణ వీరిద్దరి కాంబినేషన్లో ఓ జానపద చిత్రం నిర్మించే ప్రయత్నంలో ఎన్టీఆర్ కు కథ చెప్పాలని దాసరి నీ తీసుకెళ్లారు.

NTR: ఎన్టీఆర్‌కు తల్లిగా చేయనన్న హీరోయిన్.. చివరికి?

నటరత్న ఎన్టీఆర్(NTR), దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari narayanarao)కాంబినేషన్ లో  ఓ సినిమా తీసే ప్రయత్నం 1974 లోనే జరిగింది. ఎన్టీఆర్ తో చిక్కడు దొరకడు చిత్రాన్ని నిర్మించిన కుదురవల్లి లక్ష్మీనారాయణ వీరిద్దరి కాంబినేషన్లో ఓ జానపద చిత్రం నిర్మించే ప్రయత్నంలో ఎన్టీఆర్ కు కథ చెప్పాలని దాసరి నీ తీసుకెళ్లారు. రెండు కథలు దాసరి చెప్పగా, అందులో ఒకటి ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా లక్ష్మీనారాయణ ఆ చిత్రాన్ని నిర్మించ లేకపోయారు. ఎన్టీఆర్ కు దాసరి చెప్పిన కథ బాగా నచ్చడంతో దాసరి నీ పిలిపించి 1116/- అడ్వాన్స్ గా  ఇచ్చి బ్రదర్ వీలున్నప్పుడు ఈ కథ తో సినిమా తప్పకుండా చేద్దాం అన్నారు. అయితే ఆ కథ ఎన్టీఆర్ దగ్గర అలాగే ఉండిపోయింది. ఆయన సినిమా తీసే ప్రయత్నం చేయలేదు. 

ఆ తర్వాత డి వి ఎస్ రాజు చిత్రం కోసం కథ చెప్పడానికి దాసరి వెళ్లారు. ఆ కథ కూడా ఎన్టీఆర్ కు నచ్చింది. అయితే అందులో తల్లి పాత్ర కీలకం. ఆ పాత్ర జమున చేస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించారు. తల్లి పాత్రలు వేయడానికి అప్పట్లో ఆమె అంగీకరించక పోవడంతో ఆ కధను సినిమాగా తీసే ఆలోచన విరమించుకున్నారు. చివరకు మనుషులంతా ఒక్కటే చిత్రం తో నటరత్న, దర్శకరత్న కాంబినేషన్ సెట్ అయింది. కళా దర్శకుడు రాజేంద్ర కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా లో జమున, మంజుల కథానాయికలు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించడానికి జమున మొదట ఒప్పుకోలేదు. దాసరి కథ చెప్పి కన్విన్స్ చేసిన తర్వాత ఆమె అంగీకరించారు. మనుషులంతా ఒక్కటే (Manushulantha okkate)లో ఎన్టీఆర్ కు భార్యగా, తల్లిగా ఆమె నటించారు. 1976 ఏప్రిల్ ఏడున భారీ ఓపెనింగ్స్ తో మనుషులంతా ఒక్కటే చిత్రం విడుదల అయింది. చిత్రం హిట్ అయింది. ఈ చిత్ర శత దినోత్సవంలో ఈ సినిమాకి హీరో నేను కాదు దాసరే అని ఎన్టీఆర్ ప్రశంసించారు. 



Updated Date - 2022-09-07T01:53:28+05:30 IST

Read more