OHRK Promo: సులభ్ కాంప్లెక్స్‌కి వెళ్లే ధరలతో సినిమా థియేటర్‌లోకి..- సాయిమాధవ్ బుర్రా
ABN, First Publish Date - 2022-12-02T23:07:29+05:30
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే సీజన్ 3లో ఈ వారం.. మాటల రచయితగా తిరుగులేని సక్సెస్‌తో దూసుకుపోతోన్న సంచలన రచయిత సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే తన జీవితంలో
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే సీజన్ 3లో ఈ వారం.. మాటల రచయితగా తిరుగులేని సక్సెస్‌తో దూసుకుపోతోన్న సంచలన రచయిత సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే తన జీవితంలో సినిమాకి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిపారు. ఇంకా ‘బాహుబలి’ చిత్రానికి అవకాశం వచ్చి కూడా ఎందుకు డైలాగ్స్ రాయలేదో తెలిపారు.
అలాగే ఏపీలో సినిమా టికెట్ల ధరలపై మాట్లాడుతూ.. ‘సులభ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్లడానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్‌లోనికి వెళ్లడమనేది చాలా బాధాకరమైన విషయం’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా అనేక విషయాలను ఆయన ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.